📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Amit Mishra: ఫైనల్ లో మనమే గెలుస్తాం: అమిత్ మిశ్రా

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్‌ క్రికెట్ టోర్నమెంట్‌ 2025 (Asia Cup 2025)లో టీమిండియా మరొక అద్భుత విజయానికి అంచున నిలిచింది. ఇప్పటివరకు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓటమి చూడకుండా అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు, తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేపు జరిగే ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుండడంతో, ఈ పోరుకు ప్రత్యేక ఉత్కంఠ నెలకొంది. అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అందరూ ఈ పోరుకు ఎదురుచూస్తున్నారు.

Suryakumar: కెప్టెన్సీ బాధ్యతలతో సతమతమవుతున్న సూర్యకుమార్

భారత్‌ జట్టు ఈ సారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమన్వయంతో రాణిస్తోంది. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈసారి కూడా పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి అవుతుందని, పాక్ జట్టు కేవలం మాటలకే పరిమితమని జోస్యం చెప్పాడు.భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ అన్ని విభాగాల్లోనూ బలహీనంగా ఉందని అమిత్ మిశ్రా విశ్లేషించాడు.

“టీ20 ఫార్మాట్‌లో టీమిండియా (Team India) ను ఓడించాలంటే పాకిస్థాన్ అన్ని రంగాల్లో అసాధారణంగా రాణించాలి. కానీ ప్రస్తుత పాక్ జట్టును చూస్తే ఆ లక్షణాలు కనిపించడం లేదు. ఒత్తిడిని అధిగమించడంలో వారు విఫలమవుతున్నారు. కొందరు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ (2017 Champions Trophy) ఫైనల్‌ను గుర్తుచేస్తున్నారు. కానీ ఈసారి అలాంటి ఫలితం పునరావృతం కాదు” అని మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు.అయితే, టీమిండియాకు అమిత్ మిశ్రా ఒక కీలక సూచన చేశాడు.

Amit Mishra

భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్‌లను జారవిడిచారని

ఈ టోర్నమెంట్‌లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్‌లను జారవిడిచారని, ఫైనల్‌లో అలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించాడు. “టీ20 క్రికెట్‌ (T20 Cricket) లో ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపం మారిపోవచ్చు. కాబట్టి ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదు.

ఫీల్డింగ్‌ (Fielding) పై కాస్త దృష్టి సారిస్తే భారత్‌కు తిరుగుండదు” అని తెలిపాడు.ప్రస్తుత భారత జట్టు సమష్టిగా రాణిస్తోందని మిశ్రా కొనియాడాడు. “ఈ టోర్నీలో జట్టు ఒక్కరిపైనే ఆధారపడటం లేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)దూకుడైన ఆరంభాలు ఇస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు.

సంజు శాంసన్, తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు

మిడిలార్డర్‌లో సంజు శాంసన్, తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె కూడా బ్యాట్, బంతితో రాణిస్తున్నారు. ఇది జట్టుకు అదనపు బలం” అని అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాకిస్థాన్‌ను ఓడించిన భారత్, అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

amit mishra praise Asia Cup 2025 Final Breaking News india strong performance india unbeaten run latest news pakistan weak team t20 format analysis team india vs pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.