📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vishwanath Samson: సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ తండ్రి మద్దతు

Author Icon By Anusha
Updated: March 5, 2026 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vishwanath Samson: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ శాంసన్, అండగా నిలిచారు. ఇటీవల సూర్య చేసిన కొన్ని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను ఆయన ఖండించారు. “సూర్యకుమార్ నాకు మరో కొడుకు లాంటి వాడు. సంజూ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి ఎటకారం లేదు, అది కేవలం ఆత్మీయత మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Arjun Tendulkar: ఒక్కటైన అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్

సూర్య, గంభీర్ మద్దతు మరువలేనిది: విశ్వనాథ్ శాంసన్

సంజూ శాంసన్ కెరీర్‌లో సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోషించిన పాత్రను విశ్వనాథ్ కొనియాడారు. గతంలో ఏ కెప్టెన్ లేదా కోచ్ ఇవ్వని స్థాయి మద్దతును వీరు సంజూకు అందించారని ఆయన అభిప్రాయపడ్డారు. వారిద్దరి ప్రోత్సాహం వల్లే సంజూ ఈరోజు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Vishwanath Samson: Sanju’s father supports Suryakumar Yadav

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తరహా సూపర్-8 పోరులో సంజూ శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. ఒంటి చేత్తో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. అతని విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sanju Samson Father Suryakumar Yadav T20 World Cup 2026 Vishwanath Samson

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.