టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తన రిటైర్మెంట్ లైఫ్ గురించి సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్ లో, జరిగిన ‘టాలీవుడ్ ప్రో లీగ్’ (TPL) ఈవెంట్లో పాల్గొన్న ఆయన, క్రికెట్ నుండి తప్పుకున్నాక ఏం చేస్తున్నారో చెప్పారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని సరదాగా పంచుకున్నారు.. వీరేంద్ర మాట్లాడుతూ..’క్రికెట్ ఫార్మాట్లు, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
Read Also: Shafali Varma: షెఫాలీ వర్మ అరుదైన రికార్డు
‘బాహుబలి’ సినిమా రెండుసార్లు చూశా
నిజం చెప్పాలంటే.. ఇప్పుడు నాకు వేరే పని ఏమీ లేదు, ఖాళీ దొరికినప్పుడల్లా మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడటమే నా పని’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) నవ్వులు పూయించారు. ముఖ్యంగా మహేశ్ బాబు అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని చెప్పారు. అలాగే ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాను రెండుసార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. భాష పూర్తిగా అర్థం కాకపోయినా… హిందీ డబ్బింగ్‌లో అయినా తెలుగు సినిమాలు చూసే అవకాశం వదులుకోనని తెలిపారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా తనపై మంచి ఇంపాక్ట్ వేసిందన్నారు. అందులోని “తగ్గేదేలే” డైలాగ్, అల్లు అర్జున్ స్టైల్ ఇప్పటికీ తన మైండ్‌లో వున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో సెహ్వాగ్‌తో పాటు కపిల్ దేవ్, సురేశ్ రైనా కూడా సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు టోర్నమెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: