📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: Ravi Shastri: విరాట్ త్వరగా తన ఫామ్ ను పెంచుకోవాలి: రవిశాస్త్రి

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 7:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వన్డే క్రికెట్‌లో దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడంతో క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ నడుస్తోంది. పెర్త్, అడిలైడ్ వేదికగా జరిగిన ఈ రెండు వన్డేల్లో కోహ్లీ శూన్య స్కోర్ చేయడం ఆయన కెరీర్‌లో మొదటిసారి కావడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇదే అంశంపై జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Asia Cup: నఖ్వీ కి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ

ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన రవిశాస్త్రి (Ravi Shastri), విరాట్ ఫామ్ అనే విషయం ఒక్కరాత్రిలోనే పోయేదీ కాదు, అలాగే ఒక్క మ్యాచ్‌తోా తిరిగి వచ్చేదీ కాదు అని స్పష్టం చేశారు. కోహ్లీ (Virat Kohli) చాలా సంవత్సరాలుగా భారత జట్టుకు ప్రధాన స్తంభంలా నిలిచాడని, ఆయనకు క్లాస్, అనుభవం ఉన్నాయనే విషయంపై ఎలాంటి సందేహం లేదని చెప్పారు. అయితే ఫామ్‌ను తిరిగి పొందడానికి మ్యాచ్ ప్రాక్టీస్, మానసిక ఆత్మవిశ్వాసం, స్ట్రైక్ రోటేషన్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

Ravi Shastri

ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌

ప్రస్తుతం కోహ్లీ (Virat Kohli) ఫుట్‌వర్క్‌ పరంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడని రవిశాస్త్రి (Ravi Shastri) అన్నారు. ఇలాంటి పరిస్థితి అతనికి చాలా అరుదుగా ఎదురవుతుందని పేర్కొన్నారు. వన్డేల్లో అతడు అద్భుతమైన రికార్డులు సాధించాడని, అయితే రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకుండానే వెనుదిరగడం అతనికి నిరాశ కలిగించి ఉంటుందని విశ్లేషించారు.

పెర్త్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో, అడిలైడ్‌లో జేవియర్ బ్రేట్‌లెట్ బంతికి ఎల్బీగా అవుటైన కోహ్లీ.. రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన టీమ్‌ఇండియా, శనివారం సిడ్నీలో జరగనున్న మూడో వన్డేలో అయినా గెలిచి వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Cricket latest news ravi shastri comments Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.