Virat Kohli Speech RCB Training Camp 2026: ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ స్ట్రాంగ్ వార్నింగ్

Read Time:  1 min
Virat Kohli Speech RCB Training Camp 2026: ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ స్ట్రాంగ్ వార్నింగ్
FONT SIZE
GET APP

Virat Kohli Speech RCB Training Camp 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో జోష్ నెలకొంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2025లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ, ఇప్పుడు ఆ టైటిల్‌ను కాపాడుకునే (Title Defense) లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి తన సహచర ఆటగాళ్లకు ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Laxman Sivaramakrishnan Resigns BCCI Commentator : కామెంటరీకి శివరామకృష్ణన్ రాజీనామా!

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి శిక్షణ శిబిరంలో కోహ్లి జట్టు సభ్యులతో మాట్లాడారు. గత ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఆనందం పక్కన పెట్టి, కొత్త సవాళ్లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Virat Kohli Speech RCB Training Camp 2026: కోహ్లి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

“గతేడాది మనం సాధించిన విజయం కోసం గత రెండు, మూడు సీజన్లుగా చాలా కష్టపడ్డాం. ఈసారి ఇతర జట్లు మనపై గట్టిగా పోరాడతాయి కాబట్టి పోటీ మరింత కఠినంగా ఉంటుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్‌లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఛాలెంజర్లుగా బరిలోకి దిగేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది” అని కోహ్లీ తన సహచరులకు పిలుపునిచ్చాడు.

ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించాడు. “వేలం ఆసక్తికరంగా సాగింది. మా స్క్వాడ్‌ను మరింత మెరుగుపరుచుకున్నామని చెప్పగలను. జట్టులోకి కొందరు ఆటగాళ్లు వచ్చారు. విరాట్, రజత్ వంటి సీనియర్లతో పాటు కొత్త ఆటగాళ్లను జట్టులో కలపడం ద్వారా కొత్త జట్టును నిర్మించడం ఉత్సాహంగా ఉంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.