📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli : విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు: సచిన్ టెండూల్కర్ స్పందన

Author Icon By Divya Vani M
Updated: May 12, 2025 • 9:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 14 ఏళ్ల పాటు కొనసాగిన తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. 2011లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన Virat Kohli, 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకు కీలక బ్యాటర్‌గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని అందరితో పంచుకున్నాడు.

Virat Kohli విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు సచిన్ టెండూల్కర్ స్పందన

సచిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ…

“ఇప్పుడు నువ్వు టెస్టుల నుంచి రిటైర్ అవుతున్న ఈ సమయంలో, 12 ఏళ్ల క్రితం నా చివరి టెస్టు నాటి నీ అభిమానం గుర్తుకొస్తోంది. అప్పుడు నీవు నీ దివంగత తండ్రికి చెందిన పవిత్రమైన దారాన్ని నాకు కానుకగా ఇవ్వజూపావు. అది చాలా వ్యక్తిగతమైనది కావడంతో నేను దాన్ని స్వీకరించలేకపోయాను. కానీ నీ ఆత్మీయత నా హృదయాన్ని తాకింది, నా మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బదులుగా నీకివ్వడానికి నా దగ్గర అలాంటి దారం లేకపోయినా, నా ప్రగాఢమైన అభిమానం, శుభాకాంక్షలు నీకు ఎప్పుడూ ఉంటాయని తెలుసుకో” అని సచిన్ పేర్కొన్నాడు.కోహ్లీ వారసత్వం గురించి స్పందిస్తూ, “విరాట్, నీ అసలైన వారసత్వం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చి, వారిని ఆటవైపు నడిపించడమే” అని సచిన్ పేర్కొన్నాడు. “నీ టెస్ట్ కెరీర్ ఎంత అద్భుతంగా సాగింది! కేవలం పరుగులే కాదు, అంతకు మించి ఎంతో భారత క్రికెట్‌కు అందించావు. కొత్త తరం ఉద్విగ్భరిత అభిమానులను, ఆటగాళ్లను క్రికెట్‌కు ఇచ్చావు. నీ విశిష్టమైన టెస్ట్ కెరీర్‌కు అభినందనలు” అని టెండూల్కర్ కొనియాడాడు.

Read Also : Virat Kohli : కోహ్లి రిటైర్మెంట్.. తెలుగు సీఎంలు ఏమన్నారంటే?

CricketLegends IndianCricketTeam KohliSachinMoment SachinTendulkar ViratKohliRetirement ViratKohliTestCareer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.