📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్

Author Icon By Aanusha
Updated: January 1, 2026 • 8:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నూతన సంవత్సరం సందర్భంగా తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేశాడు. “నా జీవిత భాగస్వామితో 2026లోకి అడుగుపెడుతున్నాను” అంటూ కోహ్లీ (Virat Kohli) షేర్ చేసిన ఈ పోస్ట్‌కు గంటలోపే దాదాపు 40 లక్షల లైక్స్ రావడం విశేషం. 2025కి ఇది కోహ్లీ చేసిన చివరి పోస్ట్ కావడంతో, అభిమానుల్లో మరింత ఆసక్తి రేపింది.

Read also: Sikander Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా సోదరుడు మృతి

క్వాలిటీ టైమ్

ప్రస్తుతం క్రికెట్‌కు కొద్దిపాటి విరామం తీసుకున్న కోహ్లీ, త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. కుటుంబంతో క్వాలిటీ టైమ్ గడిపిన అనంతరం, కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీతో పాటు భారత్ – న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం అందుబాటులోకి రానున్నాడు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కోహ్లీ, అనుష్కల ప్రేమ ఒక వాణిజ్య ప్రకటన సమయంలో మొదలైంది. 2017 డిసెంబరులో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021లో వారికి కుమార్తె జన్మించగా, 2024లో కుమారుడు జన్మించాడు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anushka Sharma celebrity couple latest news New Year Celebration Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.