టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన ఎక్కడ స్థిరపడ్డారు? అనే ప్రశ్న అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. గత కొంత కాలంగా ఆయన పబ్లిక్‌గా కనిపించకపోవడం, క్రికెట్‌కు తాత్కాలిక విరామం తీసుకోవడంతో కోహ్లీ ప్రస్తుతం లండన్ (Kohli is currently in London)లోనే నివసిస్తున్నారనే వార్తలు ఎక్కువయ్యాయి. అయితే ఇది కేవలం ఊహాగానంగానే ఉన్నా, తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై మళ్లీ చర్చను చుట్టేశాయి.
సెయింట్ జాన్స్ వుడ్‌లో కోహ్లీ నివాసమా?
ఇటీవల ఓ క్రీడా చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ జొనాథన్ ట్రాట్ (Jonathan Trott).. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అతను సెయింట్ జాన్స్ వుడ్‌లో లేదా దాని సమీపంలోనే కదా ఉండేది? అతడిని తిరిగి వచ్చేలా ఒప్పించలేమా?” అని ఆయన అన్నాడు. వాయవ్య లండన్‌లో ఉండే సెయింట్ జాన్స్ వుడ్, విలాసవంతమైన ఇళ్లకు ప్రసిద్ధి చెందిన నివాస ప్రాంతం. గతంలో కోహ్లీ నాటింగ్ హిల్ ప్రాంతంలో నివసిస్తున్నట్టు వార్తలు వచ్చినా ట్రాట్ వ్యాఖ్యలతో ఆయన ప్రస్తుత నివాసంపై కొత్త చర్చ మొదలైంది.
కోహ్లీ స్పందనలు లండన్ నుంచేనా?
ఇటీవల కోహ్లీ ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించి సునీల్ గవాస్కర్ సరసన నిలిచిన గిల్‌ను ‘స్టార్ బాయ్’ అని అభివర్ణించాడు. “చరిత్రను తిరగరాస్తున్నావు. నువ్వు వీటన్నింటికీ అర్హుడివి” అంటూ గిల్‌ను అభినందించాడు. ఈ వ్యాఖ్యలు లండన్ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు, ఎందుకంటే అతను అక్కడే ఉన్నాడనే సమాచారం తిరుగుతోంది.
కోహ్లీ రిటైర్మెంట్ అనంతర జీవితం
2024లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ (Virat Kohli), తన కుటుంబంతో సమయం గడుపుతూ, పర్సనల్ లైఫ్‌ను ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. భార్య అనుష్క శర్మతో కలిసి విదేశాల్లో స్థిరపడాలనే నిర్ణయాన్ని కోహ్లీ తీసుకున్నట్టు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది .
విరాట్ 18 అని ఎందుకు పిలుస్తారు?
అతని తండ్రి డిసెంబర్ 18, 2006న మరణించారు. “నా జీవితంలో అత్యంత ముఖ్యమైన తేదీలలో రెండు 18 సంవత్సరాలు,” అని అతను చెప్పాడు. “ఈ సంఖ్యతో విశ్వ సంబంధం ఉండాలి,” అని అతను చెప్పాడు.
విరాట్ ఆర్సిబిలో ఎన్ని సంవత్సరాలు?
విరాట్ కోహ్లీ తన 18 సంవత్సరాల సీనియర్ క్రికెట్ కెరీర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అందించాడు మరియు ఆ జట్టుకు తొలిసారి కెప్టెన్ అయిన రజత్ పాటిదార్, దేశంలోని గొప్ప క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Yash Dayal: ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌పై కేసు నమోదు