📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli: వైరల్ అవుతున్న కోహ్లీ కొత్త లుక్..

Author Icon By Anusha
Updated: August 8, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగాడు విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ,ఉంటాడు. అయితే ఈసారి ఆయన క్రికెట్ ఆటగాడిగా కాకుండా, అతని లుక్ కారణంగా వైరల్ అయ్యాడు. లండన్‌లో తీసిన ఒక తాజా ఫొటోలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించడంతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ఈ ఫోటో మాత్రమే కాదు… దానికి అనుబంధంగా వచ్చే ఊహాగానాలే ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కోహ్లీ వన్డే క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారేమో అనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌ (Test cricket) కి వీడ్కోలు పలికిన కోహ్లీ, తన లుక్‌లో వచ్చిన ఈ డ్రమాటిక్ మార్పు, వయసుతో పాటు మానసికంగా కూడా క్రికెట్‌కు దూరంగా ఉన్నట్టుగా చూపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు.

రంగు వేయాల్సి వస్తోందంటే సమయం దగ్గరపడిందని

వన్డే రిటైర్మెంట్ లోడింగ్? అంటూ ఎంతోమంది మీమ్స్, పోస్టులు షేర్ చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోహ్లీ (Kohli) ఓ కార్యక్రమంలో తన గడ్డం గురించి సరదాగా మాట్లాడుతూ, “రెండు రోజుల క్రితమే గడ్డానికి రంగు వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటే సమయం దగ్గరపడిందని అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు. అప్పుడు సరదాగా అన్న మాటలను ఇప్పుడు అభిమానులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.కోహ్లీ శారీరకంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ, ఆయన తాజా రూపం మాత్రం రిటైర్మెంట్‌పై చర్చను మరింత పెంచింది. అయితే, తన వన్డే కెరీర్ భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన తదుపరి నిర్ణయం కోసం క్రికెట్ ప్రపంచం, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

విరాట్ కోహ్లీ జన్మస్థలం ఎక్కడ?

విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎన్ని వన్డే శతకాలు సాధించాడు?

విరాట్ కోహ్లీ 50కు పైగా వన్డే శతకాలు సాధించాడు, ఇది సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ipl-2026-will-rajasthan-royals-hand-over-leadership-responsibilities-to-dhruv-jurel/national/527785/

Breaking News Indian Cricket irat kohli kohli grey beard kohli odi retirement rumours kohli retirement news latest news london fan photo Telugu News viral kohli photo virat kohli new look

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.