📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli : కోహ్లీ 7 పరుగులకే అవుట్

Author Icon By Divya Vani M
Updated: April 2, 2025 • 10:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ లో రసవత్తర పోరు కొనసాగుతోంది ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరియు గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.దాంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.మరో ఓపెనర్ విల్ జాక్స్ 14, దేవదత్ పడిక్కల్ 4 పరుగులకే అవుట్ కావడంతో బెంగళూరు జట్టు 35 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.గుజరాత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన పదునైన బౌలింగ్‌తో ఆర్సీబీ టాపార్డర్‌ను కుదేలేశాడు.కాసేపటికే కెప్టెన్ రజత్ పటిదార్ (12) కూడా పెవిలియన్ చేరాడు.

Virat Kohli కోహ్లీ 7 పరుగులకే అవుట్

అయితే లియామ్ లివింగ్‌స్టన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మ జట్టు స్కోరును కాస్త నిలబెట్టే ప్రయత్నం చేశారు. లివింగ్‌స్టన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 5 సిక్సులు ఉన్నాయి.జితేశ్ శర్మ 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 38 పరుగులు సాధించాడు.చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడడంతో బెంగళూరుకు పోటీనిచ్చే స్కోరు సాధ్యమైంది. డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు.కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, సాయి కిశోర్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.మ్యాచ్ ఇంకాస్త ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది.

GujaratTitans IPL2025 MohammedSiraj RCBvsGT RoyalChallengersBangalore ViratKohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.