📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli: రవి శాస్త్రి లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో నేను లేను :కోహ్లీ

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో ఒక శకం గుర్తుగా నిలిచిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానుల్లో తీవ్ర భావోద్వేగాలు నెలకొన్నాయి. 2025 ఐపీఎల్ సీజన్  సీజన్ సందర్భంగా, ఆయన తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల మనసులను కదిలించింది. కోహ్లీ (Virat Kohli) తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి – “గెడ్డం తెల్లబడింది.. ఇంకేం ఆడమంటావ్!” అని నవ్విస్తూ చెప్పిన ఈ వ్యాఖ్యలో ఆయన వయసుతో పాటు టెస్ట్ క్రికెట్‌పై తన ప్రేమను కూడా చాటారు.ఇంగ్లండ్ పర్యటకు ముందు ఆకస్మాత్తుగా తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్‌ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం వ్యవధిలోనే కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది.

ఈ కార్యక్రమానికి క్రిస్ గేల్

కోహ్లీ లేని లోటును గిల్ తన బ్యాటింగ్‌తో భర్తీ చేశాడు. దాంతో తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ ఫౌండేషన్ యూవీకెన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అతనితో పాటు ఈ కార్యక్రమానికి క్రిస్ గేల్, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌, దిగ్గజ ఆటగాళ్లు రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, కెవిన్ పీటర్సన్, బ్రియన్ లారా, ఆశిష్ నెహ్రా (Ashish Nehra) లు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా హోస్ట్ గౌరవ్ కపూర్.. విరాట్ కోహ్లీని స్టేజీపైకి ఆహ్వానించాడు. మైదానంలో విరాట్ కోహ్లీని ప్రతీ ఒక్కరు మిస్సవుతున్నారని, రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు. అందుకు కోహ్లీ సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు.

రవి శాస్త్రి లేకుంటే టెస్ట్ క్రికెట్‌

రెండు రోజుల క్రితమే నా గడ్డానికి కలర్ వేసుకున్నాను. ఇంకేం ఆడమంటావ్. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి గెడ్డానికి రంగు వేసుకోవాల్సి వచ్చిందంటే.. ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం’ అని నవ్వుతూ బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి (Ravi Shastri) కి ధన్యావాదాలు తెలిపాడు. తన టెస్ట్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని, ఆయనే లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో తాను సాధించిన ఘనతలను అందుకునేవాడిని కాదన్నాడు.’నిజాయితీగా చెప్పాలంటే, రవి శాస్త్రి లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో నేను అందుకున్న ఘనతలు ఏవి సాధ్యమయ్యేవి కావు. మా ఇద్దరి మధ్య ఉన్న క్లారిటీని కనుగోవడం చాలా కష్టం. క్రికెటర్లు తమ కెరీర్‌లో ఎదగడానికి ఇలాంటి మద్దతు చాలా ముఖ్యం. నా కోసం ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో విమర్శలు ఎదుర్కొన్నాడు. నా క్రికెట్ ప్రయాణంలో రవి శాస్త్రి కీలకమైన వ్యక్తి. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది.’అని కోహ్లీ స్పష్టం చేశాడు.

Virat Kohli: రవి శాస్త్రి లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో నేను లేను :కోహ్లీ

తొలిసారి నేను యువరాజ్ సింగ్‌ను

కెరీర్ ఆరంభంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లతో తనకు మంచి సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నాడు. ‘మైదానం బయట, లోపల సీనియర్ ఆటగాళ్లతో నాకు మంచి రిలేషన్ ఉండేది. బెంగళూరు (Bangalore) లో జరిగిన నార్త్ జోన్ టోర్నీలో తొలిసారి నేను యువరాజ్ సింగ్‌ను కలిసాను. నేను భారత తరఫున ఆడటం ప్రారంభించనప్పుడు భజ్జు పా, జహీర్ ఖాన్ నాకు అండగా నిలిచారు. ఆటగాడిగా ఎదిగేందుకు సాయపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను బాగా చూసుకున్నారు. మైదానం బయట కూడా చాలా సరదాగా ఉండేవారు.

యువరాజ్ సింగ్‌ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమైంది

లైఫ్ స్టైల్ గురించి అవగాహన కల్పించారు. వారితో ఉన్న బంధాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను.ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమైంది. ఆ తర్వాత అతను క్యాన్సర్ బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఓ ఛాంపియన్‌గా క్యాన్సర్‌తో పోరాడి నా సారథ్యంలో టీమిండియా (Team India) లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ధోనీ, యువరాజ్ సింగ్ సెంచరీలు చేయడం నాకింకా గుర్తుంది. ‘అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్‌‌పై కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తు మరింత రాణించాలని ఆకాంక్షించాడు .

కోహ్లీ లేదా ధోనీ వీరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు?

విరాట్ కోహ్లీ ధోనీ కన్నా సంపన్నుడు. తాజా నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ ఆస్తి విలువ సుమారుగా ₹1,050 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ఇది ఎంఎస్ ధోనీ యొక్క సుమారు ₹1,040 కోట్లుగా ఉన్న నెట్ వర్త్ కంటే, తక్కువగా ఉంది.

విరాట్ కోహ్లీకి “కింగ్ కోహ్లీ” అనే బిరుదు ఎందుకు పెట్టారు?

విరాట్ కోహ్లీ తన కెరీర్‌ మొత్తం విభిన్న ఫార్మాట్లలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు అందించాడు. ప్రత్యేకంగా పరుగుల ఛేదనలో అతను విశేషమైన విజయాలు సాధించాడు. ఆయా పరిస్థితుల్లో ఆటను చదివి జట్టును గెలుపు వైపు నడిపించే సామర్థ్యం అతనికి ప్రత్యేకత.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Yash Dayal: యష్ దయాల్‌పై కేసు నమోదు..10 ఏళ్ల జైలు శిక్ష?

Breaking News IndianCricket KohliOnShastri latest news RaviShastriSupport Telugu News ViratKohli YuvrajSingh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.