టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి చరిత్ర సృష్టించాడు.ప్రపంచ క్రికెట్‌లో అమోఘమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణ, మ్యాచ్ సిచ్యుయేషన్‌ను అర్థం చేసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించే నైపుణ్యం కలిగిన కోహ్లీ, ఈసారి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. దీంతో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (kumar sangakkara) ను అధిగమించినట్టయింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ ఈ ఘనతను అందించాడు.
Women’s World Cup: దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్‌కు ముందు తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ, కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగాడు. ఈ క్రమంలోనే 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్న సంగక్కర రికార్డును తన 293వ ఇన్నింగ్స్‌లోనే బద్దలు కొట్టాడు.

వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఈ జాబితాలోని టాప్ 10 ఆటగాళ్లలో ఎవరికీ లేనంత పరుగుల సగటు (57.69) కోహ్లీ సొంతం కావడం విశేషం. సచిన్ సగటు 44.83గా ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: