టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్అ (Virat Kohli) ద్భుతంగా రాణిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిసిన కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
Read Also: Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. వరుస సెంచరీలతో ఫుల్ ఫామ్‌లో విరాట్
అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు
ఈ మ్యాచ్‌లో 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా అతనికి ఇది 84వ అంతర్జాతీయ శతకం. మొత్తం 93 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీ (Virat Kohli) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చివర్లో కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే
వన్డేల్లో అత్యధిక సార్లు (32 సార్లు) 150 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది.కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. చివర్లో కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: