జైపూర్ లో, జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో భాగంగా, సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో సిక్కింతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై విజయం వైపు దూసుకెళ్తోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా.. దీన్ని అలవోకగా అందుకుంటోంది ముంబై. 23 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ఓడిపోవడం అసాధ్యం.
Read Also: Venus Williams: నటుడిని పెళ్లి చేసుకున్న టెన్నిస్ ప్లేయర్
ఎనిమిది భారీ సిక్సర్లు
ఈ మ్యాచ్ (Vijay Hazare Trophy) లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) తడాఖా చూపుతున్నాడు. తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ క్రమంలో మెరుపు సెంచరీ సాధించాడు. 62 బంతుల్లోనే 100 పరుగులను రాబట్టుకున్నాడీ హిట్ మ్యాన్. ఇందులో ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లు, 10 బుల్లెట్ల వంటి ఫోర్లు ఉన్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం డొమెస్టిక్ లో అద్దిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. డొమెస్టిక్ క్రికెట్ లో అతనికి ఇది 37వ సెంచరీ. 109 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: