📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vignesh Puthur: విజయ్ హజారే లో చరిత్ర సృష్టించిన విఘ్నేశ్

Author Icon By Anusha
Updated: December 26, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదిలేసిన యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ (Vignesh Puthur) చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విజ్ఙేష్ పుతుర్ ఈ ఫీట్ సాధించాడు.

Read Also: RCB: యశ్ దయాల్ ప్లేస్ లో ఉమేశ్ యాదవ్?

జాంటీ రోడ్స్ రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్‌లో విఘ్నేశ్ (Vignesh Puthur).. త్రిపుర బ్యాటర్లు ఉదియన్ బోస్, శ్రీదామ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభిజిత్ సర్కార్, విక్కీ సాహాలను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్‌తో పాటు బ్రాడ్ యంగ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్ల పేరిట ఉండేది. వారంతా ఒకే మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును విఘ్నేశ్ బద్దలుకొట్టాడు.

Vignesh Puthur created history in Vijay Hazare

ఇక‌, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో విఘ్నేశ్‌ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో (2025) ముంబై ఇండియన్స్‌ తరఫున 5 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసిన అతను, గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ముంబై అతన్ని విడుదల చేయగా, వేలంలో రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. కొత్త ఫ్రాంచైజీకి ఎంపికైన కొన్ని రోజులకే ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

IPL 2026 Auction latest news Mumbai Indians Telugu News Vignesh Puthur Vijay Hazare Trophy 2024

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.