📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Venkatesh Iyer : వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ ఫిఫ్టీలు

Author Icon By Divya Vani M
Updated: April 3, 2025 • 10:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది.వెంకటేశ్ అయ్యర్, ఆంగ్ క్రిష్ రఘువంశీ అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ అజింక్యా రహానే, రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేయగా, రఘువంశీ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో సరిగ్గా 50 పరుగులు చేసి అవుటయ్యాడు.అంతకుముందు, టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబాటుకు గురైన కేకేఆర్ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు.

Venkatesh Iyer వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ ఫిఫ్టీలు

ఈ దశలో కెప్టెన్ అజింక్యా రహానే 27 బంతుల్లో 1 ఫోర్, 4 భారీ సిక్సర్లతో 38 పరుగులు చేశాడు.బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చిన రింకూ సింగ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఆండ్రీ రసెల్ (1) రనౌటయ్యాడు.సన్ రైజర్స్ బౌలర్లలో షమీ 1, కమిన్స్ 1, జీషన్ అన్సారీ 1, కమిందు మెండిస్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పరుగులు భారీగా లీకయ్యాయి.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.వెంకటేశ్ అయ్యర్, ఆంగ్ క్రిష్ రఘువంశీ అర్ధసెంచరీలతో దుమ్మురేపారు. కెప్టెన్ అజింక్యా రహానే, రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడారు.

Ajinkya Rahane Angkrish Raghuvanshi IPL 18 Kolkata Knight Riders (KKR) Rinku Singh Sunrisers Hyderabad (SRH) Venkatesh Iyer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.