📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Vaibhav Suryavanshi: రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్

Author Icon By Anusha
Updated: January 6, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) అద‌ర‌గొడుతున్నాడు. యూత్ వ‌న్డేల్లో త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో చెల‌రేగుతున్నాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డేలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి,

Read also: World Tour circuit in 2026: ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్

వర్షం కారణంగా

ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఈ అద్భుతం జరిగింది.. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్ (Vaibhav Suryavanshi), ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 24 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు.

Vaibhav breaks Rishabh Pant’s record

అతని స్కోరులో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. గతంలో రిషభ్ పంత్ 18 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా, వైభవ్ దానిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా భారత్‌కు 27 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను ఔటైన తర్వాత వేదాంత్ త్రివేది (31 నాటౌట్), అభిగ్యాన్ కుందు (48 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

fastest fifty youth ODI Indian youth cricket latest news Rishabh Pant record broken Telugu News Vaibhav Suryavanshi record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.