ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సిడ్నీలో ఈ నెల 4 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదో యాషెస్ టెస్ట్ అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు.
Read also: Sarfaraz Khan: టీమిండియా సెలక్టర్లపై వెంగ్‌సర్కార్ ఫైర్
39 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఖవాజా(Usman Khawaja) ఆస్ట్రేలియా తరఫున 87 టెస్ట్ మ్యాచ్‌ల్లో 6,206 పరుగులు సాధించారు. అలాగే 40 వన్డేల్లో 1,154 పరుగులు, 9 టీ20 మ్యాచ్‌ల్లో 241 పరుగులు నమోదు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకునే స్థిరమైన బ్యాటర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
పాకిస్తాన్‌లో జన్మించిన ఖవాజా, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. మైదానంలో తన ప్రదర్శనతో పాటు, ఆటకు తీసుకొచ్చిన విలువలు, క్రమశిక్షణతో అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. ఖవాజా రిటైర్మెంట్‌తో ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగియనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: