📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Upasana: ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ, క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధి కోసం కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానంలో క్రీడల ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాల కల్పన వంటి అనేక లక్ష్యాలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది.ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు నిర్ణయించారు. ఈ హబ్ ద్వారా రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్పోర్ట్స్ హబ్‌ (Sports Hub) కు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా పేరుగాంచిన పారిశ్రామికవేత్తలు, క్రీడా రంగ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను చేర్చారు.

బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు

బోర్డు ఛైర్మన్‌గా లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజయ్ గోయెంకా నియమితులవగా, కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెల (Upasana Konidela) బాధ్యతలు స్వీకరించారు.బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఉపాసన కొణిదెల, సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంజయ్ గోయెంకా ఛైర్మన్‌గా ఉన్న బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు సంజయ్ గోయెంకాతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నియమించిన సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను (PPP) నిర్మించడానికి, రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు’ అని ఉపాసన ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/physiotherapy-free-physiotherapy-services-for-the-elderly-in-telangana/telangana/525932/

board of governance Breaking News latest news Megastar Chiranjeevi public private partnership Revanth Reddy sports hub sports policy telangana government Telugu News Upasana Konidela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.