📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Deepti Sharma: దీప్తి శర్మకి శుభాకాంక్షలు చెప్పిన యూపీ డీజీపీ

Author Icon By Aanusha
Updated: November 4, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక అభినందనలు తెలిపింది.. నవి ముంబైలో జరిగిన 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ (2025 ICC Women’s ODI World Cup) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయానికి దీప్తి శర్మ (Deepti Sharma) చూపిన అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనే ప్రధాన కారణమని దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read Also: Kranti Goud: మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నజరానా

ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజీవ్ కృష్ణ దీప్తిని అభినందిస్తూ “దీప్తి శర్మ అంతర్జాతీయ వేదికపై రాష్ట్రం, దేశానికి గర్వకారణం అయ్యారు. 215 పరుగులు, 22 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక కావడం అద్భుతమైన ఘనత” అని పేర్కొన్నారు. “అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లో దీప్తి శర్మ (Deepti Sharma) అద్భుత ప్రదర్శన కనబర్చారు.

ఆమె 215 పరుగులు, 22 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ బహుమతిని గెలుచుకున్నారు. దేశం, రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ పోలీస్‌కు గౌరవం తెచ్చారు. హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు దీప్తి శర్మకు” అంటూ యూపీ పోలీస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 Deepti Sharma

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు

దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath) ప్రారంభించిన ‘కుశల్ ఖిలాడీ యోజన’ కింద క్రీడా కోటా ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా 2025 జనవరిలో నియమితులయ్యారు. టోర్నమెంట్ మొత్తంలో దీప్తి 22 వికెట్లు తీసి, 215 పరుగులు సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 28 ఏళ్ల దీప్తి చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో అర్ధశతకం, ఐదు వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. ఆమె 54 పరుగులు చేసి, 5 వికెట్లు (5/39) తీసి భారత్‌ను వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకునేలా చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Deepti Sharma ICC Women’s World Cup 2025 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.