📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Under-19 World Cup: జట్టు ఆటతీరుపై రవిశాస్త్రి ప్రశంసలు

Author Icon By Anusha
Updated: February 7, 2026 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అండర్-19 ప్రపంచకప్‌ (Under-19 World Cup) ను భారత యువ క్రికెట్ జట్టు కైవసం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు చూపిన ప్రదర్శన ప్రతి క్రికెట్ అభిమానిని గర్వపడేలా చేసింది.ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒత్తిడిని తట్టుకుని, ఎంతో నిలకడగా, బాధ్యతాయుతంగా ఆడారని తెలిపాడు.

Read Also: T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు

కేవలం మొదటి అధ్యాయం మాత్రమే

క్లిష్ట సమయాల్లో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌లా వ్యవహరించారని కితాబిచ్చాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఒకరి కోసం ఒకరు ఆడారని, ఇది వారి బలమైన వ్యక్తిత్వాన్ని, ఐకమత్యాన్ని తెలియజేస్తుందని వివరించాడు.“ప్రతిభ మిమ్మల్ని గుర్తింపు పొందేలా చేస్తుంది, కానీ మిమ్మల్ని ముందుకు నడిపించేది మీ టెంపర్‌మెంట్ మాత్రమే” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఈ యువ జట్టులో ప్రతిభతో పాటు అద్భుతమైన టెంపర్‌మెంట్ కూడా పుష్కలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. ఇది వారి కెరీర్‌లో కేవలం మొదటి అధ్యాయం మాత్రమేనని, భారత క్రికెట్‌లో ఈ కుర్రాళ్ల పేర్లు చాలా కాలం పాటు వినిపిస్తూనే ఉంటాయని రవిశాస్త్రి తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

India U19 latest news Ravi Shastri Telugu News Under 19 World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.