అండర్-19 వరల్డ్ కప్ 2026 లో భారత్ దూకుడు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కేవలం 148 పరుగులకే కట్టడి చేసి ఘన ప్రదర్శన చేశారు.
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో లీరాయ్ 62 పరుగులతో పోరాడినా, ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగారు. భారత బౌలింగ్‌లో ఉద్దవ్, ఆయుష్ చెరో మూడు వికెట్లు తీయగా, అంబ్రిష్ రెండు వికెట్లు సాధించాడు. హెనిల్, ఖిలాన్ చెరో వికెట్ తీసి జట్టును విజయంలో నిలిపారు.
Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?
అంతకుముందు టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌లో చెలరేగింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. విహాన్ మల్హోత్రా (109) అద్భుత శతకంతో ఆకట్టుకోగా, అభిజ్ఞాన్ (61), వైభవ్ సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో ఖిలాన్ పటేల్ వేగంగా పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.
ఈ విజయంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో భారత్ ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: