U19 World Cup: విజేత జట్టుకు రూ.7.5 కోట్ల భారీ నగదు

Read Time:  1 min
U19 World Cup: విజేత జట్టుకు రూ.7.5 కోట్ల భారీ నగదు
FONT SIZE
GET APP

భారత యువ క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్ వేదికపై సత్తా చాటింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అండర్-19 (U19 World Cup) పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ గెలుపుతో భారత జట్టు, ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది.

Read Also: T20 WC: ఆ విషయంలో పాక్ ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

U19 World Cup: Huge cash prize of Rs 7.5 crores for the winning team
U19 World Cup: Huge cash prize of Rs 7.5 crores for the winning team

రివార్డ్ రూ.7.5 కోట్లు

ఈ చారిత్రక విజయం నేపథ్యంలో బీసీసీఐ విజేతల‌కు భారీ నజరానా ప్రకటించింది.విజేత జట్టు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం రూ.7.5 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ నగదు బహుమతిని ఎవరికి ఎంత పంచాలనే దానిపై వివరాలను ఖరారు చేస్తున్నామని, మొత్తం రివార్డ్ మాత్రం రూ.7.5 కోట్లు అని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.