U-19 WC final:  హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..

Read Time:  1 min
U-19 WC final:  హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
FONT SIZE
GET APP

ఐదుసార్లు అండర్-19 ప్రపంచ కప్ (U-19 WC final) ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. 1998లో ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్‌తో ఇవాళ జరిగే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌పై (U-19 WC final) క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ కీలక పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఫైనల్ మ్యాచ్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది.

Read Also: FB Hack: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్

భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం

అయితే, జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఓపెనర్ ఆరోన్ జార్జ్ (9) వికెట్‌ను కోల్పోయి భారత్ ఆరంభంలో తడబడింది. ఈ క్లిష్ట దశలో వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 90 బంతుల్లో 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. ఈ క్రమంలో కెప్టెన్ ఆయుష్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

U-19 WC final: Vaibhav shines with half-century
U-19 WC final: Vaibhav shines with half-century

మరోవైపు, ఆరంభం నుంచే బౌండరీల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ, మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. ప్రస్తుతం సూర్యవంశీ 67 బంతుల్లో 145 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడి స్కోరులో 12 ఫోర్లు, 12 సిక్సులు ఉన్నాయి. పలుమార్లు బంతి స్టేడియం బయటికి వెళ్లిందంటే సూర్యవంశీ ఎంత పవర్ ఫుల్ షాట్లు కొడుతున్నాడో అర్థమవుతుంది. దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిన్నాభిన్నం చేశాడు.ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, మిగతా బౌలర్లు వైభవ్ ధాటికి తేలిపోయారు.

ఫర్హాన్ అహ్మద్, మ్యానీ లమ్స్‌డెన్ వంటి బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తాజా సమాచారం అందే సమయానికి భారత్ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (145), వేదాంత్ త్రివేది (3) క్రీజులో ఉన్నారు. ఇంకా చాలా ఓవర్లు మిగిలి ఉండటంతో, భారత్ 350 పరుగులకు పైగా స్కోరు చేసి ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.