📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Tushar Arothe: సైబర్ మోసం కేసులో రంజీ ప్లేయర్ కొడుకు అరెస్ట్

Author Icon By Anusha
Updated: October 17, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌కు చెందిన తుషార్ బాలచంద్ర అరోథే (Tushar Balachandra Arothe) బరోడా క్రికెట్ జట్టులో రంజీ క్రికెట్‌ల్లో సుదీర్ఘ ప్రాతినిధ్యం వహించిన ప్రతిష్ఠాత్మక క్రికెటర్. బరోడా జట్టుకు సంబంధించిన 100 మ్యాచ్ లకు అతడు ప్రతినిధ్యం వహించి, తన క్రీడా నైపుణ్యంతో, అనుభవంతో జట్టుకు ఎంతో మద్దతు అందించాడు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడం వలన, చిన్నప్పటి నుండే శిక్షణ, విలువల లో పెరిగాడు.

Read Also: Women’s Cricket: మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ

అతడి కొడుకు రిషికి (30) కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో మెలకువలు నేర్పాడు. దీంతో రిషి బరోడా తరఫున రంజీ, విజయ్ హజారే ట్రోఫీ (Ranji, Vijay Hazare Trophy) లిస్ట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. రిషిని టీమిండియా (Team India) లో చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. రిషి కూడా క్రికెట్ ఆడుతుండటంతో.. కుమారుడు తమ ఆశలను నెరవేరుస్తాడని అనుకున్నారు. అక్కడే రిషి మెదడులో పురుగు మెదిలింది.

డబ్బు రుచికి అలవాడు పడిన రిషి.. అడ్డదారిలో డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం ఐపీఎల్‌ (IPL) క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడాడు. తర్వాత గోవాకు మకాం మార్చి.. బెట్టింగ్‌లు, క్యాసినో నిర్వహించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గోవాలోని సైబర్‌ నేరస్థులతో పరిచయం పెంచుకున్నాడు.

బీటెక్‌ చదివిన రిషికి సాంకేతికతపై కూడా పట్టు

వారిచ్చే ఇచి కమిషన్‌కు ఆశపడి.. సైబర్‌ నేరగాళ్లు (Cyber ​​criminals) కొట్టేసిన డబ్బును వారి ఖాతాల్లోకి మల్లించడానికి సహాయం చేసేవాడు. బీటెక్‌ చదివిన రిషికి సాంకేతికతపై కూడా పట్టు ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది.పోలీసులకు చిక్కకుండా సైబర్ నేరస్థులకు సహాయం చేసేందుకు మార్గాలు అన్వేశించాడు.

View this post on Instagram

A post shared by OUR VADODARA™ (@ourvadodara)

అందులో భాగంగా కొట్టేసిన డబ్బు జమ చేసేందుకు అద్దె (మ్యూల్‌) అకౌంట్లను సమకూర్చటం మొదలుపెట్టాడు. వారితో ఎలాంటి సంబంధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకోసం ఫారిన్ ఫోన్‌ నంబర్లతో వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూపులు స్టార్ట్ చేసి.. లింకులు పంపి అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు.

ఇలా చేయొద్దని రిషిని తల్లిదండ్రులు చాలా సార్లు వారించినా

బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిన డబ్బును.. బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చి విదేశాలకు మళ్లించేవాడు. ఇలా రూ.కోటి డబ్బును విదేశాలకు మల్లించినందుకు.. అతడికి రూ.10 లక్షల కమిషన్‌ వచ్చేది.ఇలా చేయొద్దని రిషిని తల్లిదండ్రులు చాలా సార్లు వారించినా.. వారి మాట వినలేదు. చివరకు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. నకిలీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితుడు సైబర్ నేరస్థులకు పంపించిన డబ్బు.. వడోదరాలోని ఓ అకౌంట్‌కు వెళ్లినట్లు.. అది ఇనాందార్‌ వినాయక రాజేందర్‌ను (25) అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడిని ప్రశ్నించటంతో.. తాను రిషికి నగదు ఇచ్చినట్టు తెలిపాడు.

అనంతరం రిషి ఇంటి వద్ద రెండు రోజులు మాటు వేసిన పోలీసులు.. చివరకు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి తల్లి కన్నీరు పెట్టడం అందరినీ కదిలించింది. గతంలో కూడా రిషిని గోవాలో పోలీసుల అరెస్ట్ చేశారు. అయిన అతడిలో మార్పు రాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Rishi Arothe Telugu News Tushar Balchandra Arothe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.