📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Travis Head: రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం రాలేదు: హెడ్

Author Icon By Aanusha
Updated: October 17, 2025 • 9:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. వైట్‌బాల్ క్రికెట్‌ (Whiteball cricket) లో రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటతీరును చూసి తాను ఎంతో ప్రేరణ పొందినట్లు హెడ్ వెల్లడించాడు. “రోహిత్ శర్మ బ్యాటింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్ట్రోక్ ప్లే, టైమింగ్, అలాగే ప్రెషర్ సిచ్యుయేషన్స్‌లో చూపే కూల్ మైండ్‌సెట్ అన్నీ అద్భుతం. వైట్‌బాల్ ఫార్మాట్‌లో ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను,” అని హెడ్ తెలిపాడు.

Read Also: Keerthy Suresh: ధోనీ నా ఫేవరేట్ క్రికెటర్: కీర్తి సురేష్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ (Travis Head) శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీ, రోహిత్ శర్మల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కంటే రోహిత్ ఏ విషయంలోనూ తక్కువ కాదని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనే ఈ ఇద్దరూ వీడ్కోలు పలికే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఆడుతారని ఆశిస్తున్నానని తెలిపాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అటాకింగ్ ఓపెనర్లలో ట్రావిస్ హెడ్ ఒకరు. టెస్ట్‌లు, వన్డేలు, టీ20లలో సైతం తన దూకుడు ఆటతీరుతో ఆస్ట్రేలియాకు కీలక విజయాలు అందిస్తున్నాడు. అయితే, హెడ్ తన ఆటకు ప్రేరణగా భావించే వ్యక్తుల్లో రోహిత్ శర్మ ముందువరుసలో ఉన్నారని పేర్కొన్నాడు. “రోహిత్ ఒకే షాట్‌తో మ్యాచ్ మోమెంటమ్ మార్చగల ఆటగాడు. ఆయన బ్యాటింగ్ స్టైల్ నాకు ఎంతో నచ్చింది. ముఖ్యంగా ఆయన హుక్స్, పుల్‌షాట్లు చూడటమే ఒక ఆనందం,” అని హెడ్ అన్నాడు.

Travis Head

కోహ్లీ (Virat Kohli) గొప్ప వైట్ బాల్ క్రికెటర్

రోహిత్, కోహ్లీ భారత జట్టుకు ఎంతో చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ ఇద్దరూ అసాధారణమైన ఆటగాళ్లు. బహుషా కోహ్లీ (Virat Kohli) గొప్ప వైట్ బాల్ క్రికెటర్ కావచ్చు. కానీ రోహిత్ అతని కంటే ఏ మాత్రం తక్కువ కాదు. అతను తనదైన శైలిలో ఓపెనింగ్ చేసే బ్యాటర్. అతను సాధించిన ఘనతలపై నాకు చాలా గౌరవం ఉంది.

ఏదో ఒక దశలో ఈ ఇద్దరి ఆటగాళ్లను మిస్సవుతాం. అయితే 2027 వన్డే ప్రపంచకప్ (2027 ODI World Cup) వరకు ఆడుతారని అనుకుంటున్నాను. కనీసం ఆ టోర్నీ ఆడేందుకైనా వారు ప్రయత్నిస్తారు.రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం వస్తే గొప్పగా భావిస్తా. ఇప్పటి వరకైతే అతనితో కలిసి ఆడే అవకాశం దక్కలేదు.

రోహిత్‌కు ప్రత్యర్థిగా చాలా మ్యాచ్‌లు ఆడాను

మనలానే ఆడే ఆటగాడిని దూరం నుంచి చూడటం బాగుంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌ (IPL) లో రోహిత్‌కు ప్రత్యర్థిగా చాలా మ్యాచ్‌లు ఆడాను. అతను సరైన పద్దతిలో ఆడుతాడు. అయితే అతనితో కలిసి ఆడే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం రావచ్చు.

అతను మరింత సుదీర్ఘం కాలం ఆడుతాడు. అప్పుడు నాకు అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఛాన్స్ దక్కవచ్చు. అతను ఓపెనింగ్ చేసినా ఒకేలా ఆడుతాడు. బెస్ట్ బ్యాటర్ నుంచి ఎందుకు నేర్చుకోకూడదు.’అని ట్రావిస్ హెడ్ అన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Rohit sharma Telugu News Travis Head

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.