📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Tim David: టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా టీమ్ డేవిడ్

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Tim David

ఆస్ట్రేలియా బ్యాటర్ టీమ్ డేవిడ్ (Tim David) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ సాధించని ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు. భారత జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (T20 series) లో భాగంగా హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో టీమ్ డేవిడ్ బాదిన 129 మీటర్ల భారీ సిక్సర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also: Lionel Messi: హైదరాబాద్‌కు రానున్న మెస్సీ..ఎప్పుడంటే?

ఈ క్రమంలో టీమ్ డేవిడ్ (Tim David) 13 ఏళ్ల రికార్డు‌ను బద్దలుకొట్టాడు. 2012లో మార్టిన్ గప్టిల్ సౌతాఫ్రికాపై 127 మీటర్ల సిక్స్ బాదగా.. తాజాగా 129 మీటర్ల సిక్స్‌తో టీమ్ డేవిడ్ ఈ రికార్డ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో టీమ్ డేవిడ్, మార్టిన్ గప్టిల్ తర్వాత యువరాజ్ సింగ్(119 మీటర్లు), క్రిస్ గేల్(116 మీటర్లు) ఉన్నారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు.

అర్ష్‌దీప్ సింగ్ ధాటికి ట్రావిస్ హెడ్(11), జోష్ ఇంగ్లీస్(1) సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. మిచెల్ మార్ష్(11)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. కానీ టీమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారత బౌలర్లకు తన బ్యాట్‌తో బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు.

శివమ్ దూబే వేసిన మరుసటి ఓవర్‌లో

ముఖ్యంగా ఐదో బంతిని స్ట్రైట్ డ్రైవ్ షాట్‌తో స్టేడియం బయటకు పంపించాడు. ఈ బంతి 129 మీటర్ల దూరంలో పడింది. శివమ్ దూబే వేసిన మరుసటి ఓవర్‌లో మూడు బౌండరీలు బాది 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీ20ల్లో భారత్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన రెండో ఆసీస్ బ్యాటర్‌గా టీమ్ డేవిడ్ నిలిచాడు.

19 బంతుల్లో హాఫ్ సెంచరీతో కామెరూన్ గ్రీన్ .. డేవిడ్ కన్నా ముందున్నాడు.హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన టీమ్ డేవిడ్‌ను.. తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో బౌండరీ లైన్‌పై అద్భుతంగా జంప్ చేసి తిలక్ బంతిని అందుకున్నాడు. దాంతో టీమ్ డేవిడ్ 74 పరుగుల విధ్వంసానికి తెరపడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Australia vs India T20 latest news Telugu News Tim David six

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.