📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Tilak Varma: నారా లోకేశ్ కు తన క్యాప్ ను కానుకగా ఇచ్చిన తిలక్ వర్మ

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Tilak Varma

దుబాయ్‌లో ఆడిన ఆసియా కప్ 2025  (Asia Cup 2025) ఫైనల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపింది. ఈ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా భారత్ తొమ్మిదోసారి ఈ మహత్తర కప్‌ను జయించింది. ప్రత్యేకంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్ (Tilak Verma) ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ (Batting) ప్రదర్శన అభిమానుల్ని ఆకట్టుకుని, జట్టుకు గట్టి ఆధారాన్ని అందించింది.

Asia Cup 2025: తెలుగు తేజం తిలక్ వర్మపై చిరంజీవి ప్రశంసలు

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి 9వ సారి కప్ కైవసం చేసుకోవడంలో తిలక్ వర్మ ప్రధాన పాత్ర పోషించాడు. టాప్-3 బ్యాటర్లు (Top-3 batters) పెవిలియన్ చేరిన క్రమంలో ఎంతో నిబ్బరంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, మ్యాచ్ అనంతరం ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది.

తన క్యాప్ (Cap) ను తిలక్ వర్మ ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కు కానుకగా ఇచ్చాడు. లోకేశ్ అన్నా ఇది నీకోసమే… ప్రేమతో ఇస్తున్నాను అంటూ ఆ క్యాప్ పై రాసి సైన్ చేశాడు. ఈ మేరకు వీడియో పంపించాడు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించాడు.

తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడ్ని చేసిందని పేర్కొన్నాడు. “తమ్ముడూ… నీ ప్రేమ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను… నువ్వు భారత్ తిరిగిరాగానే ఆ క్యాప్ ను నీ చేతుల మీదుగా అందుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటాను… నువ్వు ఛాంపియన్” అంటూ ట్వీట్ చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

9th Asia Cup win Asia Cup 2025 Final Breaking News India victory India vs Pakistan latest news Match Highlights Telugu cricketer Tilak Varma Telugu News top-3 batter performance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.