Tilak Varma-CM Revanth: టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉండి, దేశానికి కీర్తి తెచ్చిన హైదరాబాద్ యువ కెరటం తిలక్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.. సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన నివాసంలో తిలక్ వర్మను కలిసి, ఆయన సాధించిన చారిత్రాత్మక విజయాన్ని అభినందించారు.
Read Also: Gavaskar on Kavya Maran: కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎటీజీ) చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిలక్ వర్మ విజయం రాష్ట్రానికి గర్వకారణమని, ఆయన ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: