భారత క్రికెట్‌లో మరో సంతోషకరమైన పరిణామం చోటుచేసుకుంది. యువ సంచలనం, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో హైదరాబాద్ జట్టు (Hyderabad team) కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారికంగా ప్రకటించింది.
Pat Cummins: కమిన్స్, హెడ్‌కు రూ. 58 కోట్ల ఆఫర్
తాజాగా విడుదల చేసిన జట్టు ప్రకటన ప్రకారం, మొదటి మూడు మ్యాచ్‌లకు 15 మంది ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ జట్లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో తిలక్ వర్మ జట్టును నడిపిస్తాడు. అతనికి సహాయకుడిగా రాహుల్ సింగ్ (Rahul Singh) వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
దేశవాళీ టోర్నీలోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు
ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (Tilak Varma), ఆ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవాళీ టోర్నీలోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు వంటి వారికి చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా అలీ కచీ డైమండ్, రాహుల్ రాదేశ్‌లను ఎంపిక చేశారు.
ఎంపికైన జట్టు వివరాలు:తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కచీ డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).స్టాండ్‌బై ఆటగాళ్లు: పి. నితీశ్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేశ్ కనల, మిఖిల్ జైస్వాల్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: