📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shefali Varma: దేవుడి ఆశీస్సుతోనే ఈ విజయం సాధించా: షెఫాలీ వర్మ

Author Icon By Aanusha
Updated: November 3, 2025 • 2:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ ఫైనల్‌ (2025 Women’s Cricket World Cup)లో ఘనవిజయం సాధించడం దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఆనందంలో ముంచెత్తింది..ఆదివారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్‌సేన 52 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఎన్నో ఏళ్ల తమ కలను సాకారం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ(87, 2/36) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

Read Also: Laura Volward: ఓటమిపై స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్

దాంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది. వాస్తవానికి ఈ టోర్నీకి షెఫాలీ వర్మ (Shefali Varma) ఎంపికవ్వలేదు. సెమీఫైనల్‌కు ముందు ప్రతికా రావల్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చింది. సెమీస్‌లో విఫలమైనా.. ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చింది.ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన షెఫాలీ వర్మ (Shefali Varma).. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.

‘నేను జట్టులోకి వచ్చినప్పుడే చెప్పాను. జట్టు మేలు కోరే ఆ దేవుడు నన్ను పంపించాడని. అది ఈ రోజు నిరూపితమైంది. ఈ ప్రపంచకప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను కాస్త ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలను.

Shefali Varma

అందరూ నాకు అండగా నిలిచారు

నా తల్లి దండ్రలులు, స్నేహితులు, సోదరుడు.. అందరూ నాకు అండగా నిలిచారు. ఎలా ఆడాలి అనేదానిపై నాకు అవగాహన కల్పించారు.ఈ విజయం నా జట్టుకు నాకు చాలా ముఖ్యమైనది. నా జట్టు గెలిపించాలని మాత్రమే అనుకున్నాను. నా మనసు స్పష్టంగా ఉంచుకున్నాను. నా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాను.

స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్ కౌర్ నాకు అండగా నిలిచి ప్రోత్సహించారు. నీ ఆటను నువ్వు ఆడమని చెప్పారు. ఇలాంటి క్లారిటి లభిస్తే ఆటగాళ్లు రాణించగలరు. ఇది అద్భుతమైన క్షణం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ మాస్టర్. ఆయనను చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. నేను ఆయనతో తరుచూ మాట్లాడుతుంటాను. ఆయన నాకు ఎప్పుడూ ధైర్యం చెబుతుంటారు.’అని షెఫాలీ వర్మ చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

India Women World Cup 2025 latest news Shefali Verma Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.