📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: West Indies series: వెస్టిండీస్‌ సిరీస్ కు భారత జట్టు ఇదే!

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ (Test series) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) జట్టును ప్రకటించింది. బోర్డు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఆసియా కప్ సందర్భంగా దుబాయ్‌లో ఉన్న టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌లతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. సిరీస్‌లో రెండు టెస్టులు ఉండగా, వాటికి భారత జట్టును సజావుగా ఎంపిక చేశారు.

Team India: టేబుల్లో టాప్ .. క్యాచ్ ల్లో లాస్ట్

ఆసియా కప్ టోర్నీ కోసం దుబాయ్ లో ఉన్న భారత టెస్టు జట్టుసారథి శుభ్‌మన్‌ గిల్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తో అగార్కర్ తాజాగా భేటీ అయ్యారు. టెస్టు జట్టు కూర్పుపై వారితో చర్చించాక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల ఈ సిరీస్ లో టీమిండియా శుభ్ మన్ గిల్ (Shubhman Gill) సారథ్యంలో విండీస్ తో తలపడనుంది.వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను, రిషబ్ పంత్ స్థానంలో ఎన్‌.జగదీశన్‌ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

West Indies series

బుమ్రా రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడని

ఇంగ్లాండ్‌ పర్యటనలో పెద్దగా రాణించని కరుణ్ నాయర్‌, శార్దూల్ ఠాకూర్‌ (Karun Nair, Shardul Thakur) లను పక్కన పెట్టారు. కాగా, జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడని అగార్కర్ పేర్కొన్నారు. షమీ ఫిట్‌నెస్‌పై ఇంకా అప్‌డేట్ రాలేదన్నారు. కరుణ్‌ నాయర్‌ తమ అంచనాలను అందుకోలేకపోయాడని అగార్కర్ చెప్పారు.

టీమిండియా జట్టు..

శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (బ్యాకప్ వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Ajit Agarkar BCCI Breaking News India Test Squad latest news N Jagadeesan Selection October 2 Ravindra Jadeja Vice Captain Shubman Gill Captain Telugu News West Indies Test Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.