భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) , తన బయోపిక్ ‘సైనా’లో తన పాత్ర పోషించిన నటి పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో సైనా మాట్లాడుతూ “నిజానికి ఈ అన్‌ఫాలో విషయం నేను ఎప్పుడూ గమనించలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. ఇలాంటి సోషల్ మీడియా విషయాలపై నేను ఎక్కువగా దృష్టి పెట్టను” అని తెలిపారు.
Read Also: Anirudh Ravichander: టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది
అన్‌ఫాలో వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు
ఈ మాటలతోనే ఈ అంశానికి తాను ఎంత ప్రాముఖ్యత ఇవ్వలేదో స్పష్టం చేశారు.అంతేకాదు, పరిణీతి చోప్రాతో తన అనుబంధం గురించి కూడా సైనా (Saina Nehwal)స్పష్టత ఇచ్చారు. “మేమిద్దరం ఎప్పుడూ మంచి స్నేహితులమని చెప్పుకోలేదు. సినిమా కోసం జరిగిన సెషన్లలో నా జీవిత ప్రయాణం గురించి ఆమెకు వివరించాను.
అది పూర్తిగా ప్రొఫెషనల్ అవసరాల కోసమే. షూటింగ్ సమయంలో మేము కలిసి లంచ్‌లు లేదా డిన్నర్లకు వెళ్లలేదు.రెండు మూడు వారాలకు ఒకసారి గంట లేదా రెండు గంటలు మాత్రమే కలిసేవాళ్లం. అప్పుడూ డైరెక్టర్ మా మధ్య ఉండేవారు” అని చెప్పారు. మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడపలేదని, అలాంటప్పుడు ఫాలో లేదా అన్‌ఫాలో వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని సైనా స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: