Mahieka Sharma Clapping Video: హార్డిక్ పాండ్యా ఔట్ మహీకా శర్మ రియాక్షన్ ఇదే!

Read Time:  1 min
Mahieka Sharma Clapping Video: హార్డిక్ పాండ్యా ఔట్ మహీకా శర్మ రియాక్షన్ ఇదే!
FONT SIZE
GET APP
This is Mahieka Sharma's reaction to Hardik Pandya's dismissal!
This is Mahieka Sharma’s reaction to Hardik Pandya’s dismissal!

Mahieka Sharma Clapping Video: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవ్వడం ఒక ఎత్తు అయితే, గ్యాలరీలో కూర్చున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా ప్రియురాలు, మోడల్ మహీకా శర్మ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.

Read Also: T20 WC 2026: భారత్ ఓటమిపై పగలబడి నవ్విన పాక్ మాజీ పేసర్

అసలేం జరిగిందంటే?

188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 17 బంతుల్లో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్ మొదటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ గెలవాలంటే హార్దిక్ క్రీజులో ఉండటం ఎంతో అవసరం. కానీ అతను ఔట్ అయిన వెంటనే కెమెరా స్టాండ్స్‌లో ఉన్న మహికా శర్మ వైపు మళ్లింది.

ఆ సమయంలో మహీకా శర్మ దిగులు పడాల్సింది పోయి, ముఖంపై నవ్వుతో చప్పట్లు కొడుతూ కనిపించింది. తన ప్రియుడు, జట్టు కీలక బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఆమె అలా ఎందుకు స్పందించిందో ఎవరికీ అర్థం కాలేదు. దీనికి సంబంధించిన క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.