భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశవాళీ మహిళా క్రికెట్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ మహిళా క్రికెటర్లు, అలాగే మ్యాచ్ అధికారులకు చెల్లించే మ్యాచ్ ఫీజులను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుతూ (BCCI) నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం ద్వారా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అమ్మాయిల ఆర్థిక స్థిరత్వం పెరగనుంది.
Read Also: T20 : నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20
జాతీయ టీ20 టోర్నీ
సీనియర్ మహిళల వన్డే, బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు రూ.50 వేలు, రిజర్వ్‌లకు రూ.25 వేలు చెల్లిస్తారు. జాతీయ టీ20 టోర్నీల్లో రోజుకు రూ.25 వేలు, రిజర్వ్‌లకు రూ.12,500 లభిస్తాయి. అండర్-23, అండర్-19 అమ్మాయిలకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్‌లకు రూ.12,500 చెల్లిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: