రెండ్రోజుల కిందట పొగమంచు వల్ల లక్నోలో జరగాల్సిన ఇండియా, సౌతాఫ్రికా (IND vs SA) 4వ T20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు మంచు కారణంగా వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అయితే టికెట్ కొనుగోలు చేసిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వాలని UPCA నిర్ణయించింది. ఎలాంటి కటింగ్స్ లేకుండా టికెట్ కొనుగోలు చేసిన వారి ఖాతాల్లో మనీ జమ చేస్తామని UPCA కార్యదర్శి మనోహర్ గుప్తా తెలిపారు.
Read Also: IND vs SA: నేడే 5వ T20
రిఫండ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభం
బోర్డ్ రిఫండ్ పాలసీ ప్రకారం ఏదైనా కారణంతో ఒక్క బంతి పడకుండా మ్యాచ్ (IND vs SA)రద్దైతే డబ్బులు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. టికెట్ల రిఫండ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారికి ఆన్‌లైన్‌లోనే డబ్బులు వాపస్ వస్తాయని, కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే మినహాయించుకొని మిగతా మొత్తం రిఫండ్ చేస్తామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: