📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

Author Icon By Anusha
Updated: November 13, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌–దక్షిణాఫ్రికా (IND vs SA) టెస్ట్ సిరీస్‌ కు వేదిక సిద్ధమైంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens) మైదానం ఈ ఉత్కంఠ భరిత పోరు జరగనుంది. నవంబర్ 9వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి టెస్ట్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు శ్రీకారం చుడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–27 సైకిల్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది.

Read Also: Sania Mirza: విడాకులు నన్ను ఎంతో ఆందోళనకు గురిచేశాయి: సానియా

ఈ సిరీస్‌ (IND vs SA) కు స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తుంది. భారత్, సౌతాఫ్రికా సిరీస్ మ్యాచ్‌లు ఈ రెండు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఫ్రీగా చూడాలంటే మాత్రం జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వచ్చే రిచార్జ్ ప్లాన్స్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రీగా చూడవచ్చు.

షెడ్యూల్:

తొలి టెస్ట్: నవంబర్ 14- 18 వరకు (కోల్‌కతా)
రెండో టెస్ట్: నవంబర్ 22-26 వరకు(రాంచీ)

IND vs SA

భారత జట్టు ఇదే?

శుభ్‌మన్ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వైస్ కెప్టెన్, వికెట్‌ కీపర్‌), యశస్వి జైశ్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌.

సౌతాఫ్రికా జట్టు..

టెంబా బవుమా (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్‌ మార్‌క్రమ్, కార్బిన్ బాష్, డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ముల్డర్, ముత్తుసామి, రబాడ, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరిన్నే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Eden Gardens Kolkata India vs South Africa Test series latest news Telugu News WTC 2025-27

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.