📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Pat Cummins: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. కమిన్స్ దూరం

Author Icon By Anusha
Updated: October 27, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన వేగబౌలర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తొలి టెస్టుకు దూరమయ్యారు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఆయన పాల్గొనలేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Australian Cricket Board) అధికారికంగా ప్రకటించింది. కమిన్స్‌కు కొంతకాలంగా వెన్నునొప్పి సమస్య వేధిస్తోంది. తాజాగా ఆ నొప్పి మరింత తీవ్రమైనట్లు వైద్యులు సూచించడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌?

Pat Cummins

స్మిత్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా

కమిన్స్ స్థానంలో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) కెప్టెన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది స్మిత్‌కు మరోసారి టీమ్‌ను నాయకత్వం వహించే అవకాశం కావడం విశేషం. గతంలో ‘సాండ్‌పేపర్ స్కాండల్’ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించబడిన స్మిత్,

తిరిగి టీమ్‌లో కీలక పాత్ర పోషించుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో స్మిత్‌కు ఎక్కువ అనుభవం ఉండటంతో, జట్టును సమర్ధవంతంగా నడిపించగలడనే నమ్మకం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఉంది.

కమిన్స్ స్థానంలో బోలాండ్?

కమిన్స్ ప్లేస్‌లో స్కాట్ బోలాండ్ జట్టులోకి రావచ్చని సమాచారం. గత సిరీస్‌ల్లో బోలాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది.దీంతో తొలి టెస్టులో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బోలాండ్‌తో పాటు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ వంటి సీనియర్ బౌలర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు.

అయితే కమిన్స్ (Pat Cummins) లాంటి ఆటగాడు లేకపోవడం ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్‌కు లోటు.గత నెల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా కమిన్స్ అందుబాటులో లేరు. అప్పుడే బోర్డు ఆయనకు కొంత విశ్రాంతి కల్పించింది. అయితే యాషెస్ టోర్నమెంట్‌లో కూడా అతను దూరమవ్వడం అభిమానుల్లో నిరాశను కలిగించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ashes 2025 Australia Cricket Australia vs England Breaking News latest news Pat Cummins Injury Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.