📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Temba Bavuma: అసాధారణ ప్రదర్శనతోనే గెలిచాం: సౌతాఫ్రికా కెప్టెన్

Author Icon By Anusha
Updated: November 26, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం గౌహతి వేదికగా ముగిసిన ఆఖరి టెస్ట్‌లో
సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది.ఈ విజయంతో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది.

Read Also: ICC Rankings: ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్

ఇది చాలా పెద్ద విజయం

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన టెంబా బవుమా (Temba Bavuma) సమష్టి ప్రదర్శనతోనే ఈ గొప్ప విజయాన్ని అందుకున్నామని తెలిపాడు.’ఇది చాలా పెద్ద విజయం. వ్యక్తిగతంగా ఈ గెలుపు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. గాయం కారణంగా కొన్ని నెలల పాటు నేను ఆటకు దూరమయ్యాను.

రీఎంట్రీ ఇచ్చిన తొలి సిరీస్‌లోనే విజయాన్నందుకు కోవడం గొప్ప అనుభూతినిచ్చింది. భారత గడ్డపై 2-0తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం అంత సులువు కాదు. ఈ గెలుపు క్రెడిట్ మా ఆటగాళ్లదే.ఈ సిరీస్‌లో మా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. మా సన్నద్దత అనేది ఒక అంశమైతే.. మైదానంలో సత్తా చాటి జట్టుకు సహకారం అందించాలనే మా ఆటగాళ్ల తపన మరో అంశం.

Temba Bavuma: We won on Indian soil with an extraordinary performance: South Africa captain

సైమర్ హర్మర్ మా మ్యాచ్ విన్నర్

జట్టులోని ప్రతీ ఒక్కరు జట్టు కోసం కష్టపడుతున్నారు. మేం ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు. జట్టుగా మేం మంచి స్థితిలో ఉన్నాం. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు విజయంలో కీలక పాత్ర పోషించాలనే తపనతో ఉన్నారు. ఈ సిరీస్‌లో ప్రతి ఒక్కరు రాణించారు. భారీ శతకాలు సాధించలేకపోయినా.. విజయానికి కావాల్సిన పరుగులు చేశారు.

ముఖ్యంగా నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. నా జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.సైమన్ హర్మర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను 2015లోనూ భారత పర్యటనకు వచ్చాడు. ఇక్కడ ఆడిన అనుభవం అతనికి ఉంది. కేశవ్ మహరాజ్‌కు గొప్ప సహకారం అందించాడు.

బంతిపై అతనికి మంచి నైపుణ్యం ఉంది. వారిని కాదని మరో బౌలర్‌కు బంతిని ఇవ్వలేకపోతున్నా. ఈ సిరీస్‌లో సైమర్ హర్మర్ మా మ్యాచ్ విన్నర్.’అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా టెంబా బవుమా (Temba Bavuma) జైత్రయాత్ర కొనసాగుతోంది. సారథిగా 12 మ్యాచ్‌లకు బవుమా 11 గెలిపించాడు. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

India vs South Africa latest news Simon Harmer South Africa Cricket Telugu News Temba Bavuma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.