📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Rahul Dravid-సచిన్ మాట విని తప్పు చేసానని ఇప్పటికి భాదపడుతున్న ద్రావిడ్

Author Icon By Pooja
Updated: August 23, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rahul Dravid: భారత క్రికెట్ చరిత్రలో “ది వాల్”గా(The Wall) ప్రసిద్ధి చెందిన రాహుల్ ద్రవిడ్, తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు. తన జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు సచిన్ టెండూల్కర్ సలహా విన్నదే అని, ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ పశ్చాత్తాపంతో గుర్తుచేసుకుంటున్నానని వెల్లడించాడు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ ద్రవిడ్ ఈ ఘటనను వివరించాడు. 2011లో భారత్ ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ద్రవిడ్ ఆడుతుండగా అంపైర్ సైమన్ టఫెల్ అతడిని క్యాచ్ ఔట్‌గా ప్రకటించారు. కానీ బంతి తన బ్యాట్‌ను తాకలేదని ద్రవిడ్‌కు నమ్మకం. “డ్రైవ్ చేసినప్పుడు శబ్దం వినిపించింది కానీ నా బ్యాట్‌కు తగిలిన ఫీలింగ్ రాలేదు” అని ఆయన గుర్తుచేసుకున్నాడు.

Rahul Dravid-సచిన్ మాట విని తప్పు చేసానని ఇప్పటికి భాదపడుతున్న ద్రావిడ్

ఇంతకీ ఎం జరిగిందంటే?

ఆటమైదానంలో అంపైర్ నిర్ణయంపై అనుమానంతో ద్రవిడ్, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వద్దకు వెళ్లి చర్చించాడు. ద్రవిడ్ బంతి బ్యాట్‌ను తాకలేదని చెప్పినా, “శబ్దం చాలా గట్టిగా వచ్చింది, నువ్వు బాదావ్ అనిపించింది” అని సచిన్ అన్నాడట. దాంతో ద్రవిడ్ తన భావన తప్పు అనుకుని రివ్యూ అడగకుండానే పావిలియన్‌కి వెళ్లిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రీప్లే చూసిన తర్వాత ద్రవిడ్‌కు అసలు నిజం తెలిసింది. బంతి బ్యాట్‌ను తాకలేదని, బ్యాట్ షూలేస్‌ను తాకడంతో ఆ శబ్దం వచ్చిందని రుజువైంది. అప్పట్లో అంపైర్ సైమన్ టఫెల్ లాంటి దిగ్గజ నిర్ణయాన్ని సవాలు చేయడం అంత సులభం కాదని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఆ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో కోల్పోయినా, ద్రవిడ్ మాత్రం నాలుగు టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించి 461 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

రాహుల్ ద్రవిడ్ తన కెరీర్‌లో పెద్ద తప్పుగా ఏది గుర్తించారు?
సచిన్ టెండూల్కర్ సలహా విని, రివ్యూ తీసుకోకుండా అవుట్‌గా మైదానం విడిచిపెట్టడమేనని ద్రవిడ్ పేర్కొన్నారు.

అసలు ఏమి జరిగింది?
అంపైర్ ద్రవిడ్‌ను క్యాచ్ ఔట్‌గా ప్రకటించగా, బంతి బ్యాట్‌కు తగలలేదని ఆయనకు నమ్మకం. కానీ సచిన్ సలహా మేరకు రివ్యూ తీసుకోకుండా పెవిలియన్‌కు వెళ్లిపోయారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-central-government-gives-clarity-on-tiktok-services/national/534930/

CricketMemories Google News in Telugu IndiaVsEngland Latest News in Telugu RahulDravid SachinTendulkar Telugu News Today TheWall

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.