Asia Cup: గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన అఫ్ఘానిస్థాన్ జట్టు, ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సన్నద్ధమవుతోంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాయకత్వంలో 17 మంది ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో అఫ్ఘాన్ జట్టు తొలిసారిగా సెమీఫైనల్‌కు(Semifinal) చేరి చరిత్ర సృష్టించింది. ఆ టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి సంచలనం రేపింది. అదే ఉత్సాహంతో ఆసియా కప్‌లోనూ తమ సత్తా చాటాలని జట్టు సంకల్పం వ్యక్తం చేస్తోంది. ఈ సారి ఆసియా కప్ సెప్టెంబర్ 9న అబుదాబిలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అఫ్ఘాన్ జట్టు హాంగ్‌కాంగ్‌తో తలపడనుంది. గ్రూప్-ఏలో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్‌కాంగ్ జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 16న బంగ్లాదేశ్‌తో, 18న శ్రీలంకతో అఫ్ఘాన్ జట్టు తన గ్రూప్ మ్యాచ్‌లను ఆడనుంది.
రషీద్ ఖాన్ సారథ్యంలో అఫ్ఘాన్ జట్టు సభ్యులు
రషీద్ ఖాన్(Rashid Khan) కెప్టెన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహమ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, అల్లా ఘజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్‌హక్ ఫరూఖీ.
అఫ్ఘానిస్థాన్ జట్టు ఆసియా కప్ 2025లో ఎవరితో తొలి మ్యాచ్ ఆడనుంది?
అఫ్ఘాన్ జట్టు సెప్టెంబర్ 9న హాంగ్‌కాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
అఫ్ఘాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు?
స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసియా కప్ 2025లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :