📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: BCCI: బీసీసీఐ కీలక పదవిలో తెలుగు వ్యక్తి చాముండేశ్వరనాథ్

Author Icon By Anusha
Updated: October 17, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) (BCCI) అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు తేజం, మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ (Chamundeshwaranath) ఎన్నిక కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా మారింది. భారత క్రికెటర్ల అసోసియేషన్ (ఐసీఏ) ప్రతినిధిగా ఆయన ఎంపికయ్యారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఈ-ఓటింగ్‌లో చాముండేశ్వరనాథ్‌కు మద్దతు లభించింది.

Read Also: ODI series: వన్డే సిరీస్.. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేమరూన్ ఔట్

మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటు వేయగా, అందులో చాముండేశ్వరనాథ్‌కు 755 ఓట్లు, ఆయన ప్రత్యర్థి రాజేశ్ జడేజాకు కేవలం 83 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ భారీ మెజారిటీతో చాముండేశ్వరనాథ్ విజయం సాధించి బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్‌లో చోటు దక్కించుకున్నారు.

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో చాముండి ఐసీఏ ప్రతినిధిగా మూడేళ్లు కొనసాగనున్నారు. మహిళా క్రికెటర్ల తరఫున సుధా షాకు ఈ అవకాశం దక్కింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఐసీఏ ప్రతినిధిగా శుభాంగి దత్తాత్రేయ కులకర్ణి ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన చాముండేశ్వరి నాథ్

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి (Rajahmundry) కి చెందిన చాముండేశ్వరి నాథ్.. ఆంధ్ర జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 1978-92 మధ్య కాలంలో మొత్తం 14 సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

BCCI

44 ఫస్ల్ క్లాస్ మ్యాచ్‌ల్లో 1818 పరుగులు చేశారు. ఇందులో 4 శతకాలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఆటగాడిగా వీడ్కోలు పలికిన అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)తో పాటు బీసీసీఐ,

బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా

ఐపీఎల్‌ (IPL) గవర్నింగ్ కౌన్సిల్‌లో పలు పదవులు చేపట్టాడు.ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2009లో భారత జట్టుకు మేనేజర్‌గా పని చేశారు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో సెక్రటరీ, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్, ఆంధ్ర అండర్ 19, మహిళల జట్ల సెలెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు.

వ్యాపార వేత్త అయిన చాముండీ.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ జట్టుకు కో ఓనర్‌గా ఉన్నారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌తో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌‌‌ (Sachin Tendulkar) కు చాముండీ మంచి స్నేహితుడు. అంతర్జాతీయంగా సత్తా చాటే ఆటగాళ్లకు చాముండీ ఖరీదైన కార్లను బహుమతిగా అందిస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BCCI Breaking News chamundeswaranath latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.