📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Telangana : తెలంగాణ యువ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ మూడు పతకాలు గెలిచింది

Author Icon By Digital
Updated: May 6, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : తెలంగాణకు చెందిన యువ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ పుణెలో జరిగిన జాతీయ సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్‌లో సంచలనం సృష్టించింది. ఒకే రోజు మూడు పతకాలను గెలిచి నిష్క అగర్వాల్ తన అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శించింది. ఆమె వాల్టింగ్ టేబుల్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్సింగ్ బీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు మరియు ఒక రజత పతకాన్ని గెలిచింది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం మూడు పతకాలను సాధించి తన స్థాయిని చాటుకున్న నిష్క అగర్వాల్, ఢిల్లీలో జరిగిన మెగా టోర్నీలో నాలుగు ఈవెంట్లలో పోటీ పడగా, మూడింటిలో పతకాలను గెలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో 11.433 స్కోరుతో టాప్ ప్లేస్లో గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం వాల్టింగ్ టేబుల్ విభాగంలో 12.883 స్కోరుతో మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో 10.967 స్కోరుతో రెండో స్థానం సాధించి సిల్వర్ మెడల్‌ను గెలుచుకుంది.

Telangana : తెలంగాణ యువ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ మూడు పతకాలు గెలిచింది

Telangana : తెలంగాణ యువ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ మూడు పతకాలు గెలిచింది

తొలిసారిగా డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల్లో అరంగేట్రం చేసిన నిష్క అగర్వాల్, టేబుల్ వాల్ విభాగంలో స్వర్ణం, జిమ్నాస్టిక్స్ ఆల్ రౌండ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. అంతేకాకుండా, ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో నిష్క స్వర్ణం సాధించింది. జాతీయ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన నిష్క, కొరియాలో జూన్ 12 నుండి ప్రారంభమయ్యే ఏషియన్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది.

Read More : IPL 2025: ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉన్నా: కోహ్లీ

Breaking News in Telugu Floor Exercise Gold Medals Google News in Telugu Gymnastics Latest News in Telugu National Championship Nishk Aggarwal Silver Medal Telangana Telugu News Telugu News online Telugu News Today Vaulting Table

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.