📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Tejpal Singh:కబడ్డీ క్రీడాకారుడిని కాల్చి చంపిన దుండగులు

Author Icon By Aanusha
Updated: October 31, 2025 • 9:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌లో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు తన స్నేహితుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. లూథియానా జిల్లా జాగ్రావ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. పాత విభేదాలు, వ్యక్తిగత గొడవలే ఈ ఘోర హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

Read Also: Shivam Record: దూబే, బుమ్రా అన్‌బీటెన్‌ రికార్డులకు ముగింపు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ అయిన తేజ్‌పాల్ సింగ్ (Tejpal Singh) (26) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య ఓ పాత గొడవకు సంబంధించి వాగ్వాదం మొదలైంది.

Tejpal Singh

నిందితుల కోసం గాలింపు చేపట్టారు

కొద్దిసేపటికే అది తీవ్ర ఘర్షణకు దారితీసింది.మాటామాటా పెరగడంతో, వారితో కలిసిన మరో గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీ తీసి తేజ్‌పాల్ (Tejpal Singh) ఛాతీపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్యాలయానికి సమీపంలోనే జరగడం గమనార్హం.రక్తపు మడుగులో పడి ఉన్న తేజ్‌పాల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News Kabaddi player murder latest news Ludhiana crime Punjab News Tejpal Singh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.