📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Mohammad Kaif: రో-కో ల వల్లే టీమిండియా గెలిచింది: మహమ్మద్ కైఫ్

Author Icon By Aanusha
Updated: December 1, 2025 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను కోల్పోగా.. కోహ్లీ-రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

Read Also: Chinnaswamy Stadium: KSCAకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు

ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.అనంతరం సౌతాఫ్రికా బ్యాటర్లు విజయం కోసం ఆఖరి వరకు పోరాడారు. కానీ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో జట్టుకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif).. కోహ్లీ, రోహిత్ లేకుంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని తెలిపాడు.

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా ఔటై ఉంటే తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలయ్యేది. కోహ్లీ, రోహిత్ రాణించకుంటే టీమిండియా భారీ స్కోర్ చేసేది కాదు. 300, 350 రన్స్ చేయకుండా సౌతాఫ్రికా ఈజీగా భారత్‌ను ఓడిస్తుంది. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా రోహిత్, విరాట్ కోహ్లీదే.యువ ఆటగాళ్లు, కుర్రాళ్లను జట్టులోకి తీసుకురావడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు.

Team India won because of R-K: Mohammad Kaif

వారు ఇదే తరహాలో రాణించారు

కానీ వారు కనీసం 200 పరుగులు కూడా చేయలేరు. కాబట్టి జట్టుకు విజయాలు కావాలంటే కోహ్లీ, రోహిత్‌లను జట్టులో కొనసాగించాల్సిందే. విరాట్ కోహ్లీ సెంచరీతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఏడు సిక్సర్లు కొట్టగా.. రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదాడు. వారు ఒక కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సిరీస్‌కు ముందు సిడ్నీలోనూ వారు ఇదే తరహాలో రాణించారు.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ పరాజయం అనంతరం భారత జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజయం ఉపశమనం కలిగించింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కోహ్లీ, రోహిత్ అవసరం జట్టుకు ఉంది. కోహ్లీకి 37, రోహిత్‌కి 38 ఏళ్ల వయసు. అయినా వారు అద్భుతంగా ఆడారు. వారు గనుక పరుగులు చేయకపోయి ఉంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌ను చాలా సునాయసంగా గెలిచేది.’అని మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif)పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

India vs South Africa latest news Mohammad Kaif Rohit sharma Team India Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.