📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Team India: టేబుల్లో టాప్ .. క్యాచ్ ల్లో లాస్ట్

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో భారత క్రికెట్ జట్టు అద్భుత ఫామ్‌లో దూసుకుపోతోంది. బ్యాటింగ్‌లో క్రమంగా పరుగుల వర్షం కురిపిస్తూ, బౌలింగ్‌లో ప్రత్యర్థులకు ఊపిరి తీసుకోనీయకుండా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో ఫైనల్‌ వరకు చేరుకుంది.

ఇప్పటివరకు ఓటమి రుచి చూడకుండా అగ్రగామిగా నిలవడం జట్టు శక్తి సామర్థ్యాలను సూచిస్తుంది. అయితే ఇంతటి విజయోత్సాహం మధ్యలో ఒక సమస్య మాత్రం అభిమానులను, మాజీ ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తోంది – అదే పేలవమైన ఫీల్డింగ్.

IND VS BAN : ఆసియా కప్ 2025 అభిషేక్ శర్మ 75 రన్స్, భారత్ ఫైనల్‌లోకి

ప్రత్యేకించి కీలక సందర్భాల్లో ఫీల్డర్లు వదిలేసే క్యాచ్‌లు మ్యాచ్ మోమెంటం మార్చేలా ప్రభావం చూపుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా (Team India) ఫీల్డర్లు మొత్తం 12 క్యాచ్‌లను జారవిడిచారు.

ఈ గణాంకం కేవలం ఒక చిన్న పొరపాటు కాదు, టోర్నీ మొత్తంలోనే అత్యధిక క్యాచ్‌లు వదిలిన జట్టుగా భారత్‌ నిలిచింది. ముఖ్యంగా చివరి రెండు మ్యాచ్‌ల్లోనే తొమ్మిది క్యాచ్‌లు వదిలేయడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

ఫైనల్ లాంటి కీలక పోరులో

పాకిస్థాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌ (High Voltage Match) లోనూ భారత ఫీల్డర్లు నాలుగు కీలక క్యాచ్‌లు నేలపాలు చేశారు.ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే కథ పునరావృతమైంది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు 5 క్యాచ్‌లు జారవిడవగా, అందులో 4 ఒకే బ్యాటర్ సైఫ్ హసన్‌వి కావడం గమనార్హం.

Team India

అతను ఈ అవకాశాల‌ను సద్వినియోగం చేసుకుని అద్భుత‌మైన హాప్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ రెండు మ్యాచ్‌లలో భారత్ గెలిచినప్పటికీ, ఫైనల్ లాంటి కీలక పోరులో ఇలాంటి తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఈ వరుస వైఫల్యాలపై మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ని టీమిండియా ఫీల్డింగ్ త‌ప్పిదాల విష‌య‌మై ప్రశ్నించగా, అతను ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

దుబాయ్ స్టేడియంలోని

“ఈ స్థాయిలో సాకులు చెప్పకూడదు, కచ్చితంగా మేము క్యాచ్‌లు అందుకోవాలి. ఫైనల్‌కు వెళ్లే జట్టుగా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అయితే, దుబాయ్ స్టేడియం (Dubai Stadium) లోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లైటింగ్ కొన్నిసార్లు కంటికి అడ్డుపడుతోంది.

దానివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతోంది. దానికి మేం అలవాటు పడాలి” అని వరుణ్ వివరించాడు. కారణం ఏదైనా, ఫైనల్ పోరుకు ముందు ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం టీమిండియా (Team India) కు ఎంతైనా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Asia Cup 2025 Bangladesh Match Batting Strength Bowling Performance Breaking News Cricket performance Final Qualification latest news Super 4 Victory Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.