📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs AUS: టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి

Author Icon By Aanusha
Updated: October 31, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకోలేకపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ విభాగంలో ఘోర వైఫల్యం కారణంగా భారత్ పరాజయాన్ని చవిచూసింది. దీంతో సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Read Also: IND vs AUS: భారత్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది.. 50 పరుగులకే 5 వికెట్లు ఢమాల్

ఈ మ్యాచ్‌లో (IND vs AUS) ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్షిత్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఇందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/13) మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీసారు. మార్కస్ స్టోయినీస్ ఒక వికెట్ తీసాడు. పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడి భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు.

IND vs AUS

హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.

అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/26), వరుణ్ చక్రవర్తీ(2/23), కుల్దీప్ యాదవ్(2/43) రెండేసి వికెట్లు తీసారు. పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా.. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.

స్వల్ప లక్ష్యచేధనలో ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. దాంతో 4.3 ఓవర్లలోనే ఆసీస్ 51 పరుగులు చేసింది. తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌కు ట్రావిస్ హెడ్ వెనుదిరగ్గా.. జోష్ ఇంగ్లీస్‌తో కలిసి మిచ్ మార్ష్‌ చెలరేగాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతన్ని కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. టీమ్ డేవిడ్‌ను వరుణ్ పెవిలియన్ చేర్చాడు.

జోష్ ఇంగ్లీస్(20)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. మిచెల్ ఓవెన్‌ను బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. కానీ చేయాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. మాథ్యూ షార్ట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. మార్కస్ స్టోయినీస్ క్విక్ డబుల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. బ్యాటింగ్‌లో రాణించిన హర్షిత్ రాణా బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

abhishek sharma Breaking News India vs Australia T20 latest news Team India loss Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.