బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన ఐదో టీ20 అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, వర్షం మాత్రం మ్యాచ్‌ను పూర్తిగా చెడగొట్టింది. ప్రారంభం నుంచే భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా, ఆ దూకుడును వర్షం నిలిపేసింది. చివరికి మ్యాచ్ రద్దయిందని అంపైర్లు ప్రకటించడంతో, ముందంజలో, 2-1 తేడాతో ఉన్న సిరీస్‌ను టీమిండియా (Team India) కైవసం చేసుకుంది.
Read Also: IND vs AUS: ఐదో టీ20కి వర్షం అంతరాయం
దూకుడుగా ప్రారంభించిన టీమిండియా
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు (Team India) మొదటి ఓవర్ నుంచే దాడి మోడ్‌లోకి వెళ్లింది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ కలిసి అద్భుతమైన ఆరంభం అందించారు. కేవలం 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు నమోదు చేసారు..
గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం.. ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దాంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: