📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

FB Hack: టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్

Author Icon By Anusha
Updated: February 6, 2026 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా క్రికెటర్, ఐపీఎల్‌లో తన ఆటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నరింకు సింగ్, ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్‌ (FB Hack) కు గురైనట్లు తెలిసింది. బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా గత కొన్ని నెలలుగా రింకు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటన ఇప్పుడు క్రికెట్ అభిమానులతో పాటు సోషల్ మీడియా వినియోగదారుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై రింకు సోదరుడు సోను సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: U-19 WC Final: టాస్ గెలిచిన భారత్

విచారణ ప్రారంభం

ఖాతా ఎప్పుడు హ్యాక్ అయిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, అనుమానం రావడంతో రింకు సోదరుడు సోను సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.ఫిర్యాదు స్వీకరించిన అలీగఢ్ సైబర్ క్రైమ్ సెల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హ్యాకర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. హ్యాక్ చేసిన ఖాతాను ఉపయోగించి ఏవైనా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారా లేదా అభ్యంతరకర పోస్టులు పెట్టారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

Team India cricketer Rinku Singh’s Facebook account hacked

ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం..

గత ఏడాది జూన్ 8న లక్నోలో జరిగిన గ్రాండ్ రింగ్ వేడుకలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ సహా పలువురు ఉన్నత స్థాయి నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Facebook Hack IPL Star latest news Rinku Singh Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.