📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Team India: శ్రీలంక వన్డే సిరీస్‌కి మహిళ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Author Icon By Sharanya
Updated: April 8, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌ కోసం బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌ లో భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తిరిగి జట్టులో చేరనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న హర్మన్‌ ప్రీత్‌ ఈ సిరీస్‌తో తన కెప్టెన్సీని తిరిగి ప్రారంభించనుంది. ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఏప్రిల్ 27న ప్రారంభం అవుతుంది. ఇందులో భారత్‌, శ్రీలంక మరియు దక్షిణాఫ్రికా జట్లు పాల్గొననున్నాయి. మూడు జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడే ఈ సిరీస్‌లో, తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ మ్యాచ్ మే 11న జరగనుంది.

భారత మహిళా జట్టులో మార్పులు

గాయాల కారణంగా పేస్ బౌలర్ల రేణుకా సింగ్ ఠాకూర్ మరియు టిటాస్ సాధు ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. అయితే, కశ్వి గౌతమ్‌, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్‌ వంటి కొత్త ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇది ఈ ముగ్గురు ఆటగాళ్లకు జాతీయ జట్టులో మొదటి అవకాశం కావడం విశేషం. అలాగే, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా కూడా జట్టులో తిరిగి చేరారు. ఈ సిరీస్ ద్వారా శ్రీ చరణి, కశ్వి గౌతమ్, శుచి ఉపాధ్యాయ్ వంటి యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం కలిగింది. వీటితో పాటు, భారత జట్టులో స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించడం జరిగింది. ఇక ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఏప్రిల్‌ 27న ప్రారంభం కానుంది. మే 11న ఫైన‌ల్‌ జరుగుతుంది. భారత్‌, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో ఆడుతుంది. భారత జట్టు ఏప్రిల్ 27న శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. మూడు జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అన్ని మ్యాచులు కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలోనే జరుగన్నాయి. 

ముక్కోణపు సిరీస్‌కు భారత్ జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి కౌర్, అమన్‌జోత్ కౌర్, కాశ్వి గౌతమ్‌, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసాబినీస్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ.

ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ ఇదే

మొద‌టి వన్డే: శ్రీలంక vs భారత్, ఏప్రిల్ 27
రెండో వన్డే: భారతదేశం vs దక్షిణాఫ్రికా, ఏప్రిల్ 29
మూడో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 02
నాలుగో వన్డే: శ్రీలంక vs భారత్, మే 04
ఐదో వన్డే: దక్షిణాఫ్రికా vs భారత్, మే 07
ఆరో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 09
ఫైనల్: మే 11

Read also: Rajat Patidar: రజత్ పాటిదార్ కు రూ.12 లక్షల జరిమానా

#BCCI #HarmanpreetKaur #IndiaWomen #SmritiMandhana #SriLankaODISeries #TeamIndia #WomenCricketTeam #womenscricket Breaking News Today In Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.